భోజనం అయినా టిఫిన్ అయినా మితంగా తీసుకుంటే అమృతం. కాదు అని ఎక్కువగా తీసుకుంటే అనేక రోగాలకు మన శరీరం వెల్ కమ్ పలికినట్టే. ఇక నిపుణులు చెప్పేది ఏమిటి అంటే ఉదయం టిఫిన్ మితంగా తీసుకోవాలి, అలాగే మధ్యాహ్నం భోజనం ఎక్కువగా తీసుకోవచ్చు, కాని రాత్రి పూట మాత్రం ఫుడ్ చాలా తక్కువగా తీసుకోవాలి.
రాత్రి 8 గంటల తర్వాత భోజనం చేస్తే త్వరగా బరువు పెరుగుతారనే అపోహ చాలా మందిలో ఉంది. ఇక మరో విషయం రాత్రి ఎక్కువగా భోజనం తీసుకుంటే ఆయాసం, ఉబ్బసం, బరువు పెరగడం, గురక సమస్యలు కూడా వస్తాయని కొందరు అనుకుంటారు.
రాత్రిపూట ఎక్కువ ఆహారం తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే పడుకునే అరగంట ముందు ఆహారం తింటే అజీర్తి సమస్యలు వస్తాయి. సుమారు పడుకోవడానికి రెండు గంటల ముందు మీరు ఆహారం తీసుకోవాలి. రైస్ ఎక్కువగా ఆహారంలో లేకుండా చూసుకోవాలి. రోటీ, జొన్నలు, సజ్జలు, తృణధాన్యాల ఆహారం తీసుకోవడం ఉత్తమం.