గ్రేట్ సీఎం సార్ – తమిళనాడు సీఎం స్టాలిన్ సాయం చేసిన వీడియో వైరల్

Tamil Nadu CM Stalin's help video goes viral

0
103

ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజల బాధలు తీర్చాలి. సీఎంగా ఉన్న చాలా మంది నేతలు తమ ముందు ఎవరైనా అర్జీ తీసుకువస్తే వెంటనే దానికి పరిష్కారం చూపిస్తారు. అన్నీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాంటి విషయాలలో చాలా చొరవ చూపిస్తారు. అధికారులకి చెప్పి ఆ పని పూర్తి చేయమని చెబుతారు.

తమిళనాడు సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డీఎంకే స్టాలిన్ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. సీఎం అయిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజారంజక పాలన అందిస్తున్నారు. తాజాగా కొద్ది రోజులుగా సీఎం స్టాలిన్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేడు తిరుచ్చి వెళుతున్న సమయంలో ఆయన కాన్వాయ్ ముందుకు సాగుతోంది.

ఈ సమయంలో ఓ మహిళ అక్కడ అర్జీ పట్టుకుని నిల్చుంది. వెంటనే ఆయన తన కాన్వాయ్ ఆపించారు. ఆమె సమస్య ఏమిటి అని తెలుసుకున్నారు. అంతేకాదు దానిపై సంతకం పెట్టి ఈ సమస్య తీరుతుంది అని అధికారులకి కూడా తెలిపారు. సీఎం ఇలా వెంటనే నా పని పూర్తి చేయించారని ఆ మహిళ ఎంతో సంతోషించింది.

ఈ వీడియో చూసేయండి..https://www.youtube.com/watch?v=oydndc5mBDQ&t=59s