ఇంగువ మనం చాలా వంటకాల్లో వాడుతూ ఉంటాం. ఇక సాంబారు పులిహూర వండారు అంటే ఆ ఇంగువ కాస్త పడాల్సిందే. అయితే కొందరు ఆ వాసన అస్సలు కిట్టదు అంటారు. ఇక వంటలో వేస్తే దానిని అస్సలు ముట్టుకోరు. కానీ ఇలాంటి ఆలోచన పక్కన పెట్టండి. ఇంగువ వంటికి చాలా మంచిది. ఇంగువని 16 వ శతాబ్దం నుంచి దేశంలో వంటల్లో వాడటానికి ఉపయోగిస్తున్నారు.
అంటే సుమారు 400 ఏళ్ల నుంచి మన వంటల్లో ఈ ఇంగువ వాడుతున్నాం. ఇంగువ ఆయుర్వేద మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి వారానికి ఓసారి అయినా వంటలో ఇంగువ వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
ఇంగువలో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఎలాంటి చెడు బ్యాక్టిరియానీ బాడీలో చేరనివ్వదు. అంతేకాదు జీర్ణక్రియ సులువుగా చేస్తుంది. రక్తపోటు, మధుమేహం అదుపులో ఉంచడానికి ఇది చక్కగా పనిచేస్తుంది.
గమనిక.. ఇక కొందరు ఇంగువ అలర్జీగా అస్సలు పడదు అంటారు. వారి శరీర తత్వం బట్టీ వారికి పడకపోవచ్చు అలాంటి వారు ఇంగువకు దూరంగా ఉండాలి.