కొంత మంది సమయానికి ఆహారం తీసుకోరు. అంతేకాదు మరికొందరు అతిగా మసాలాలు చిరుతిళ్లు జంక్ ఫుడ్లు తింటారు. ఇలాంటి వారికి గ్యాస్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. కడుపులో మంట గ్యాస్ నొప్పి ఇలాంటి సమస్యలు ఉంటాయి. కొందరు ఎన్ని మందులు వాడినా ఈ ఇబ్బంది నుంచి బయటపడలేరు.
కడుపులో మంట, కడుపు ఉబ్బరం, ఛాతినొప్పి ఈ సమస్యలతో చాలా మంది ఆస్పత్రులకి వెళుతున్నారు. అయితే ఇంట్లో దొరికే పదార్థాలతో గ్యాస్ సమస్య నుంచి బయటపడొచ్చు. అసలు ఈ గ్యాస్ సమస్య ఎందుకు ఎక్కువ అవుతుంది అంటే? మనం తీసుకున్న ఆహారం సరిగ్గా డైజిస్ట్ కాకపోవడం వల్ల. ఇలా జీర్ణం కాకపోవడంతో ఈ సమస్య ప్రారంభం అవుతుంది.
మరి దీనికి ఏం చేయాలి అనేది చూస్తే
అల్లంను ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఉదయం అల్లం తెనె రసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్య తగ్గుతుంది
మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని నమలండి
సోంపు గింజలలో డికాషన్ చేసుకొని తాగండి
ఎంతో మంచిది కొబ్బరి నీరు కూడా గ్యాస్ సమస్య తగ్గిస్తుంది
వీలైతే రెండు మూడు రోజులకి తాగండి
మసాలాలు, కారం ఇలాంటి వాటికి దూరంగా ఉండండి