తెలుగులో ఆ రెండు చిత్రాలు చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్

Varalakshmi Sarath Kumar is Acting those two films in Telugu

0
96

కోలీవుడ్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా చేస్తుంది. అంతేకాదు నెగిటీవ్ షేడ్ ఉన్న రోల్ తో ఇటు తెలుగు తమిళ ప్రేక్షకులకి బాగా దగ్గర అయింది. ఇక లేడీ విలన్ అంటే ఆమె మాత్రమే అని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. ఒకటా, రెండా ఆమె చేతిలో ఆరు సినిమాలు పైగానే ఎప్పుడు ఉంటున్నాయట.

టాలీవుడ్ కోలీవుడ్ లో లేడీ విలన్ పాత్రలకు వరలక్ష్మి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. అంతేకాదు ఆమె హీరోయిన్ తో సమానమైన పారితోషికం అందుకుంటోంది. ఓ పక్క తమిళ సినిమాలు చేస్తూ ఇటు తెలుగులో కూడా పలు చిత్రాలు చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో కూడా ఆమె చాలా కథలు విన్నారు. ఇక తెనాలి రామకృష్ణ బీఏబీఎల్–నాంది సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రాక్ సినిమాలో విలన్ గా ఆమె ఇక్కడి ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక తాజాగా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని తీసే సినిమాలో ఆమె నటించనున్నారు. అంతేకాకుండా హనుమాన్ అనే సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం ఆమె నటించనున్నారు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.