బేరియాట్రిక్ సర్జరీ అనేది స్థూలకాయంతో బాధపడుతున్న వారికి చేసే సర్జరీ. ఇక చాలా మంది ఈ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఈ ఆపరేషన్ మనుషులు చేయించుకోవడం చూశాం, ఇలాంటి సర్జరీ కుక్కలకు చేయడం ఎప్పుడైనా విన్నారా.
పూణెలో ఓ శునకానికి బేరియాట్రిక్ సర్జరీ చేశారు. నగరానికి చెందిన యాస్మిన్ దారువాలా దీపిక అనే శునకాన్ని పెంచుకుంటున్నారు. ఇది రోజు రోజుకి బరువు పెరుగుతోంది. సుమారు 50 కిలోల బరువు పెరిగింది.
దీంతో కిడ్నీ, కార్డియాక్, లివర్, హై బీపీ వంటి సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో ఈ కుక్క నడవలేకపోతోంది.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేది. దీనిని జంతు వైద్యులకి చూపించారు, చివరకు వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ చేయించాలని సూచించారు. ఈ కుక్కకి 8 ఏళ్ల 6 నెలల వయసు. మొత్తం 1.20 లక్షల ఖర్చుతో ఆపరేషన్ చేయించారు. దాని శరీరంలో పేరుకుపోయి 5 కిలోల అదనపు కొవ్వును తొలగించారు. శునకం బరువు 45 కిలోలకు చేరుకుంది.