ముంబైలో అనామిక అనే వేశ్య తన జీవితం ఎందుకు ఇలా మారింది అనేది ఓ ఎన్ జీ వో సంస్ధ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది, మాది బిహార్ మా అమ్మ కూలి పని చేసుకునేది. మా నాన్న కూడా కూలి పనికి వెళ్లేవాడు. బాగా మందుకి అలవాటు పడ్డాడు. అతనికి వచ్చే కూలి సంపాదన కూడా తాగుడు తాగేవాడు. అంతేకాదు మా అమ్మ సంపద కూడా తీసుకుని ఇంట్లో అన్నం కూడా వండనిచ్చేవాడు కాదు.
అంతా తాగుడే చివరకు నన్ను ఓ కసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత నా భర్త నిజం చెప్పాడు, మీ నాన్నకు 20 వేలు ఇచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పాడు. ఇక ముంబై తీసుకువచ్చి అతని కోరిక తీరిన తర్వాత ఇక్కడ వేరే వారికి అమ్మేశాడని.
ఇలా దాదాపు 25 ఏళ్లు ఇక్కడే ఉండిపోయాను అని నాకు పిల్లలు పుట్టలేదని ఇక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలో తెలియక ఈ ఊబిలో కూరుకుపోయాను అని ఇంటర్వ్యూలో తెలిపింది. నా తండ్రి నా జీవితం ఇలా చేశాడు అని బాధపడింది.