జగన్ పిఎ నాగేశ్వర రెడ్డి గురించి తెలుస్తే షాక్ అవుతారు..!!

జగన్ పిఎ నాగేశ్వర రెడ్డి గురించి తెలుస్తే షాక్ అవుతారు..!!

0
92

జగన్ ఈ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసి సిఎం గా బాధ్యతలు చేపట్టిన జగన్ కి పిఏ గా ఎవరు ఉంటారని అంతట ఆసక్తి కనపరచగా వైఎస్ జగన్ దూకుడుకి తగ్గ పిఎ వస్తారా లేదా అన్న అంశం కూడా అంతట చర్చ జరిగింది.. మరి ఆ పోస్టులోకి ఎవరు వస్తారా అని అనుకుంటున్న తరుణంలో జగన్ కు అంత్యంత సన్నిహితుడు,నిత్యం తనవెంట ఉండే వ్యక్తిని తన పిఎ గా జగన్ సెలక్ట్ చేసుకున్నారు.

దాదాపు 11ఏళ్లుగా జగన్ వెంటే ఉంది అయన కష్టసుఖాల్లో వెన్నుదన్నుగా ఉంటున్న కె నాగేశ్వర రెడ్డిని తనకు పీఏగా ఎంపిక చేసుకుంటూ ఉత్తర్వులు కూడా జారీచేశారు ఎపి నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. వివిధ మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం గల నాగేశ్వర రెడ్డి అనునిత్యం జగన్ వెంటే ఉంటూ అయన అన్నిరకాల ప్రోత్సాహాలు ఇస్తూ వచ్చారు. ప్రజల్లో మమేకమైపోవడానికి జగన్ సంకల్పించిన ప్రజాసంకల్ప యాత్రలో అయన కీలక పాత్ర వహించాడు. ఆ యాత్ర లో జగన్ అడుగడుగుకి ప్రజలు అందించిన ఆశిర్వాదలలో అయన కృషి ఎంతో ఉంది.. జగన్ మనసెరిగి పనిచేసుకు పోవడం అతడి నైజం. జగన్ కి ఏది కావలి పసిగట్టి అది చేసిపెట్టే గుణం ఆయనది.. అందుకే జగన్ ఆయనకి ఆ పదవి ఇచ్చారు..

విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై దాడి జరిగిన సమయంలో జగన్ పక్కనే నాగేశ్వర రెడ్డి ఉన్నాడు. వివిధ వర్గాలతో సమావేశం ఏర్పాటు చేయించడంలో నాగేశ్వర రెడ్డికి మంచి పట్టుంది. జగన్ కి ఎప్పుడు ఏది అవసరమో ,ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో నాగేశ్వర రెడ్డికి పూర్తిగా అవగాహన ఉంది. ఇక పులివెందుల సీఎం క్యాంప్ కార్యాలయ పీఏగా డి రవిశంకర్ ని ఎంపిక చేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఎప్పటినుంచో తన వెంట వుండే వారికే జగన్ ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.