పసుపు సర్వగుణ సంపన్నమైంది. ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. అంతేకాదు ఇందులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినా దానిని ఎదుర్కొంటుంది. ఆయుర్వేదంలో పసుపు ప్రాధాన్యత ఎంతో ఉంది.
పసుపు కాలేయాన్ని కాపాడుతుంది. పసుపు షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల చికిత్సకు సహాయపడుతుంది. రక్తంలోని కొవ్వుని కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
పసుపు కెమోథెరపీని మరింత ప్రభావవంతం చేసి ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తుంది. మలబద్దకం రాదు, జీర్ణక్రియ బాగుంటుంది. ఇక పసుపు తరచూ వాడటం వల్ల వంటల్లో వేస్తూ ఉంటే జలుబు తలనొప్పి కాళ్ల నొప్పులు ఫీవర్ ఇలాంటి సమస్యలు ఉండవు. ఇక ఏదైనా గాయాలు అయినా అవి మానడానికి కూడా ఆ పసుపు ఉపయోగపడుతుంది.వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని తాగితే దగ్గు, శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి.