ఇక అల్లరి నరేష్ ఆ టైపు సినిమాలు చేయాల్సిందేనా..!!

ఇక అల్లరి నరేష్ ఆ టైపు సినిమాలు చేయాల్సిందేనా..!!

0
93

మహర్షి సినిమా విజయం లో మహేష్ బాబు ది ఎంత పాత్ర ఉందొ అల్లరి నరేష్ ది కూడా అంతే పాత్ర ఉందని చెప్పొచ్చు.. ఎందుకంటే సినిమా కి కీ పాయింట్ అల్లరి నరేష్ పాత్ర అయిన రవి దే కాబట్టి.. ఆ పాత్ర వల్లే ఈ సినిమా కి అంత క్రేజ్ వచ్చింది.. ఈ విషయాన్నీ ఆ సినిమా దర్శకనిర్మాతలు కూడా ఒప్పుకుంటారు.. స్వయానా మహేష్ బాబు కూడా అల్లరి నరేష్ పాత్ర సినిమా కి ఎంతో కీలకమైందని చెప్పాడు..

తాజాగా ఇప్పుడు ఇదే తరహా పాత్రలో నరేశ్‌ మరోసారి కనిపించబోతున్నారట. మాస్‌ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ‘డిస్కో రాజా’ చిత్రంలో నరేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం సునీల్‌ను ఎంపికచేసుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర నరేశ్‌కు దక్కినట్లు తెలుస్తోంది. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఓ సైఫై థ్రిల్లర్‌గా ఉండబోతోందని సమాచారం. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేశ్‌ కథానాయికలుగా నటిస్తున్నారు.