శేఖర్ కమ్ముల – ధనుష్ సినిమాలో హీరోయిన్ ఆమేనా ?

Is she the heroine in the movie of Sekhar Kammula- Dhanush

0
149

సినిమాలు సూపర్ హిట్ అవుతూ ఉంటే, కొన్ని కాంబినేషన్లు వరుసగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఇది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఫాలో అవుతూ ఉంటారు. ఇక దర్శకుడు నిర్మాత హీరో హీరోయిన్ ఈ నాలుగు విషయాల్లో మనం ఈ కాంబినేషన్ చూస్తు ఉంటాం.

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తీసిన ఫిదా సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. సాయిపల్లవి ఈ సినిమాలో ఎంతో బాగా నటించింది. ఇక మళ్లీ లవ్ స్టోరీ సినిమా కూడా వస్తోంది. ఇక రిలీజ్ కు సిద్దంగా ఉంది. అయితే తాజాగా వీరి కాంబో మరోసారి రిపీట్ కానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమాలో కథానాయికగా సాయిపల్లవిని తీసుకోవాలనే ఆలోచనను మేకర్స్ ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి.మారి 2 తమిళ చిత్రంలో ధనుష్ సరసన సాయిపల్లవి నటించిన విషయం తెలిసిందే.