భారత్ లో హ్యాందాయ్ కొత్త కారు ‘ అల్కజార్ ‘ కు భారీ బుకింగ్స్ – కారణం ఇదే

Hyundai's new car 'Alcazar' huge bookings in India

0
86

హ్యాందాయ్ కొత్త కారు ‘ అల్కజార్ ‘ భారీ బుకింగ్స్ వస్తున్నాయి అని కంపెనీ ఉద్యోగులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియాలో పలు రకాల కంపెనీలు కొత్త కారులు మార్కెట్ లోకి వస్తున్నాయి అని తెలిగానే బుక్కింగ్ కి అంతగా ఆసక్తి చూపరు. ఆ కారులు రోడ్డేకా వాటి పనితీరు, రేటింగ్ , రివ్యూస్ చూసి కార్లు కొంటుంటారు సాదరణంగా. కాని హ్యాందాయ్ కంపెనీ  కొత్త మోడల్  అల్కజార్ కారు రోడ్డేక్క ముందే విపరీతంగా బుకింగ్స్ వస్తున్నాయి అంట.

భారత మార్కెట్లో SUV లకు డిమాండ్ పెరుగుతుండటంతో , హ్యాందాయ్ కొత్త కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది . ఈ ‘ అల్కజార్ ‘ మోడల్ కు అపుడే భారీ డిమాండ్ వస్తోంది . 4,000 వాహనాలకు బుకింగ్స్ వచ్చాయని , డెలివరీ కూడా ప్రారంభించినట్లు కంపెనీ చెబుతోంది.కారు రోడ్డుపై వచ్చాక డిమాండ్ ఇంకా పెరుగుతుందనే ఆశతో కంపెనీ ఉంది . ధర రూ . 16.3 లక్షల నుంచి రూ . 20 లక్షల మధ్య ఉండటంతో హెక్టర్ ఎంజీ , టాటా సఫారీలకు గట్టి పోటీదారుగా అల్కజార్ నిలబడుతోంది .

అల్కజార్ కారు ప్రత్యేకతలు ఇవే….

ఆరు లేదా ఏడు సీట్ల ఆప్షన్ ఉన్న ఈ కారు ఇంటీరియర్స్ అదిరిపోతున్నాయి .

10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ ,

ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ,

వైర్ లెస్ చార్జింగ్ ,

బోస్ ప్రీమియం సౌండ్ సిస్టమ్ తో పాటు అన్ని సీట్లకు ఎయిర్ బ్యాగ్ ఫెసిలిటీ ఆకట్టుకుంటున్నాయి .

360 డిగ్రీ కెమెరాతో పాటు ఇతర ఆధునిక కార్లలో ఉండే సదుపాయాలన్నీ ఈ కారులో ఉన్నాయి . డీజిల్ , పెట్రోల్ లో లభిస్తున్న ఈ కారు ప్రిస్టేజ్ , ప్లాటినం , సిగ్నేచర్ వేరియంట్లలో లభిస్తోంది .