ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపు నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి దర్శన వేళల్లో మార్చామని ఆలయ అధికారులు తెలిపారు.
కరోనా నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు.
శ్రీశైలం ఆలయంలో జరిగే నిత్యపూజాకైంకార్యాలు, పరోక్షాసేవలు యధావిధిగా కొనసాగనున్నట్లు ఈఓ కెఎస్ రామారావు తెలిపారు.
శ్రీశైలం క్షేత్ర పరిధిలో దుకాణాలు సాయంత్రం 4 వరకు తెరిచేందుకు దేవస్థానం అనుమతించింది.