బిగ్ బాస్ త్రీ హోస్ట్ గా అక్కినేని హీరో

బిగ్ బాస్ త్రీ హోస్ట్ గా అక్కినేని హీరో

0
123

దక్షిణాది అన్ని భాషల్లో ఈ కార్యక్రమం సక్సెస్‌ అయింది. తెలుగులో ఇప్పటికే రెండు సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న బిగ్‌బాస్‌ షో.. మూడో సీజన్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ షోలో పాల్గొనేవారి లిస్ట్‌ ఇదేనంటూ కొన్ని పేర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.

అయితే ఈ సారి హోస్ట్‌ విషయంలో బిగ్‌బాస్‌ బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఫైనల్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించి బుల్లితెరపైనా తనకు తిరుగులేదని నిరూపించుకున్న టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున.. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ను హోస్ట్ గా ఫ్రోగ్రాంను నిర్వహించనున్నాడు.నార్త్‌ నుంచి సౌత్‌కు దిగుమతైన రియాల్టీ షో బిగ్‌బాస్‌కు ఇక్కడ మంచి ఆదరణ లభించింది. నాగార్జున హోస్టింగ్‌లో బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ ఇంకా ఆసక్తికరంగా మారబోతోందని తెలుస్తోంది. మొదటి సీజన్‌కు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, రెండో సీజన్‌ ను న్యాచురల్‌స్టార్‌ నాని హోస్ట్ గా చేశారు.