తెలంగాణ ప్రయివేటు ఆసుపత్రులకు షాక్.. కరోనా చికిత్స-టెస్టుల ధరల పై సర్కారు ఫుల్ క్లారిటీ

Here are the fees for covid treatment in private hospitals: Telangana government orders

0
96

ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్ వైద్యానికి ఫీజులు ఇంతే : తెలంగాణ సర్కారు ఉత్తర్వులు

కోవిడ్ రోగులకు వైద్యం పేరుతో ప్రయివేటు ఆసుపత్రులు లక్షలకు లక్షలు కొల్లగొడుతున్నాయి. కోవిడ్ తగ్గుతుందో లేదో కానీ… ఒకసారి ప్రయివేటు దవాఖానకు పోతే ఇల్లు గుల్ల అవుతున్నది. జలగలు రక్తం పీల్చినట్లు ప్రయివేటు దవాఖానాలు జనాల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. లక్షలకు లక్షలు కట్టించుకుని డెడ్ బాడీలను చేతిలో పెడుతున్న పరిస్థితులున్నాయి. అయితే తెలంగాణ సర్కారు ప్రయివేటు దవాఖానాల్లో కోవిడ్ వైద్యానికి ఎంత ఫీజు తీసుకోవాలో ధరల పట్టిక నిర్ణయించింది. ఆ వివరాలు చదవండి.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రయివేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, టెస్టులకు ధరలను సర్కారు ఖరారు చేసింది. దీనికోసం జిఓ నెం. 401ని తాజాగా వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసింది.
జనరల్ వార్డులో ఐసోలేషన్, కరోనా పరీక్షలకు రోజుకు 4వేల రూపాయలు తీసుకోవాలి.
ఐసియు గదిలో రోజుకు 7,500 రూపాయలు మాత్రమే తీసుకోవాలి.
వెంటిలేటర్ తో కూడిన ఐసియూ రూమ్ లో రోజుకు 9వేల రూపాయలు తీసుకోవాలి.

 

కరోనా టెస్టులకు సంబంధించిన రేట్లు ఇలా నిర్ణయించింది.

పిపిఈ కిట్ కు రూ.273
హెచ్.ఆర్.సిటీ రూ.1995
డిజిటల్ ఎక్స్ రే రూ.1300
ఐఎల్ రూ.1300
డీ డైమర్ రూ.300
సీఆర్.పి రూ.500
ప్రొకాల్ సీతోసిన్ రూ.1300
ఫెరిటీన్ రూ.400
ఎల్.డి.హెచ్. 140 మాత్రమే వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.


ఇక సాధారణ అంబులన్స్ కిలోమీటరుకు రూ.75 గా కనీస ఛార్జీ రూ. 2వేలకు మించరాదని సూచించింది. వసతులతో కూడిన అంబులెన్స్ కు కిలోమీటర్ కు రూ.125, మినిమం ఛార్జి 3వేలుగా నిర్ణయించింది.