మన సినిమాల్లో హీరోయిజం ఎంత బాగా హైలెట్ అవుతుందో, అలాగే విలన్ని కూడా హీరోకి తగ్గ క్యారెక్టర్ ని సెట్ చేస్తున్నారు. అప్పుడే సినిమాకి ఎంతో ప్లస్ అవుతోంది. ఇప్పుడు విలన్స్ కు కూడా భారీ మార్కెట్ ఉంటోంది, హీరోలతో సమానంగా విలన్స్ కు రెమ్యునరేషన్లు ఉంటున్నాయి. ఇక విలన్స్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా దూసుకుపోతున్నారు.
మరి మన టాలీవుడ్ లో టాప్ విలన్స్ గా ఎవరు ఉన్నారు. వారికి ఎంత రెమ్యునరేషన్ అందుతోంది అనేది చూద్దాం ( అయితే సినిమా బడ్జెట్ బట్టీ వారి రెమ్యునరేషన్ ఉంటుంది) ఒక్కో సినిమాకు కోటి రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అందుకునే ప్రతినాయకులు కూడా ఉన్నారు.
1. జగపతిబాబు ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు ఉండవచ్చు
2. ప్రకాష్ రాజు ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకూ ఉండవచ్చు
3. శ్రీకాంత్ బాలయ్య అఖండ సినిమాలో విలన్గా నటిస్తున్నాడు. ఆయనకు కోటి రూపాయల వరకూ ఉండవచ్చు
4. సోనూ సూద్ ఈ రియల్ హీరో సినిమాకి 3 కోట్ల వరకు ఉండవచ్చు
5. మిర్చి సంపత్ రాజ్ ఒక్కో సినిమాకు 40 లక్షలకు పైగానే పారితోషికం ఉండవచ్చు
6. సాయి కుమార్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ 50 లక్షలు వరకూ పారితోషికం ఉండవచ్చు
7. సుదీప్ కన్నడ సూపర్ స్టార్ -ఒక్కో సినిమాకు 3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఉండవచ్చు
8. ఆది పినిశెట్టి సినిమాకు కోటికి పైగానే ఉండవచ్చు
9. రవికిషన్: భోజ్పురి సూపర్ స్టార్ సినిమాకు 40 లక్షల వరకు ఉండవచ్చు
10. హరీష్ ఉత్తమన్ ఈ తమిళ విలన్ కూడా సినిమాకు 30 లక్షల వరకు ఉండవచ్చు 11. వివేక్ ఒబేరాయ్: వినయ విధేయ రామలో విలన్ అయ్యాడు. 3 కోట్లు చార్జ్ ఉండవచ్చు 12. నీల్ నితిన్ ముఖేష్ సాహో సినిమాతో మన దగ్గర మెప్పించాడు. 2 కోట్లు పారితోషికం ఉండవచ్చు.