అభ్యంగ‌న స్నానం అంటే ఏమిటి – ఎలా చేయాలి

What is an Abhyangana Snanam - How to Do it

0
124

మ‌నం ఎక్కువ‌గా పూజ‌లు చేసే స‌మ‌యంలో ఏదైనా పురాణ‌గాధ‌లు చ‌దివే స‌మ‌యంలో వింటూ ఉంటాం.
అభ్యంగన స్నానం అనేమాట‌. అస‌లు చాలా మందికి అనుమానం ఉంటుంది. ఈ అభ్యంగ‌న స్నానం అంటే ఏమిటి అని. మ‌రి అది ఏమిటో స‌వివ‌రంగా తెలుసుకుందాం. స్నానం అనేది రోజూ చేయాల్సిందే, క‌చ్చితంగా త‌నువు అంతా త‌డిచి ఆ దేవుడిని ప్రార్ధిస్తూ స్నానం చేయాలి.

పురుషులు రోజూ త‌లారా స్నానం చేస్తే మంచిది. ఇక అభ్యంగ‌న స్నానం అంటే త‌లంటు స్నానం అని చెబుతారు. అయితే పురుషులు ఏదైనా అనారోగ్యంగా ఉన్న‌ప్పుడు మిన‌హా ప్ర‌తీ రోజూ త‌ల స్నానం చేస్తే మంచిది. ఇలా త‌ల‌స్నానం చేసి నిత్యం దేవాల‌యానికి వెళ్లాలి.

ఉద‌యం 5 గంట‌ల‌కే నువ్వుల‌ నూనెతో తలంటి పోసుకోవడం మంచిది. ఇక చ‌న్నీటి స్నానం అయితే శిర‌స్సుపై నుంచి చేయాలి. వేడి నీరు అయితే కాళ్ల నుంచి పోసుకోవాలి అని పండితులు చెబుతున్నారు.
నువ్వులనూనెను బాగా రాసి మర్దన చేసి నలుగు పిండితో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేయడం వ‌ల్ల చ‌ర్మ వ్యాధులు ఉండ‌వు. అలాగే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను ఉంటుంది కాబ‌ట్టి ఆ శ‌క్తి కూడా మ‌న‌కు వ‌స్తుంది. ఇలా అభ్యంగ‌న స్నానం చేస్తే ఆ దైవ అనుగ్రహాన్ని పొందుతారు.