మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మాతృ వియోగం, ఎంపీ రంజిత్ రెడ్డి సంతాపం

0
114

చేవెళ్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తల్లి, దివంగత జస్టిస్ కొండా మాధవరెడ్డి సతీమణి కొండా జయలతాదేవి (91) శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కొడుకు విశ్వేశ్వర్ రెడ్డితోపాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి.

ఎంపీ రంజిత్ రెడ్డి సంతాపం :

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తల్లి కొండా జయలలితాదేవి మరణం బాధాకరమని ప్రస్తుత టిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి సంతాపం తెలిపారు. కొండా జయలలితాదేవి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.