మరియమ్మ లాకప్ డెత్ కేస్ : మరో పోలీసు అధికారిపై వేటు

0
130

అడ్డ‌గూడురు పోలీస్‌స్టేష‌న్ లో మరియమ్మ అనే దళిత మహిళ లాకప్ డెత్ కేసులో మరో పోలీసు అధికారిపై వేటు పడింది. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తాజాగా చౌటుప్పల్ ఎసిపి సత్తయ్యను కమిషరేట్ కు అటాచ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భువనగిరి ట్రాఫిక్ ఎసిపి శంకర్ కు అదనపు బాద్యతలు అప్పగించారు.

మరియమ్మ లాకప్ డెత్ కేసులో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు బట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు సిఎం కేసిఆర్ ను ప్రగతి భనవ్ లో కలిసి వినతిపత్రం సమర్పించారు. అంతేకాకుండా గవర్నర్ తమిళిసై ను కూడా కలిసి మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ నేపథ్యంలో సిఎం కేసిఆర్ జరిగిన ఘటనపై సీరియస్ అయ్యారు. దీనికి కారుకులైన వారిని అవసరమైతే ఉద్యోగంలోంచి తీసిపడేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరియమ్మ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు.

మరియమ్మ లాకప్ డెత్ కసులో ఇప్పటికే ఎస్సై మహేష్, ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ సిపి మహేష్ భగవత్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఎసిపి సత్తయ్య అటాచ్ మెంట్ తో ఈ కసులో నలుగురు పోలీసులపై చర్యలు తీసుకున్నట్లు అయింది. ఇంకెవరి ప్రమేయం అయినా ఉందా ఇంకా ఎంతమంది మీద చర్యలు తీసుకుంటారు? సస్పెండ్ అయిన వారి ఉద్యోగాలు తొలగిస్తారా అనేది విచారణ పూర్తయితేనే తేలనుంది.

కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన వార్త కింద చదవండి…

మరియమ్మ లాకప్ డెత్ పై సిఎం కేసిఆర్ సీరియస్ : ఇవీ ఆదేశాలు