భార్యని చెల్లిగా పరిచయం చేసి వేరేవాడితో పెళ్లి చేశాడు – వీళ్లు మాములు జంట కాదు

He introduced his wife as a sister and married someone else

0
143

కొందరు ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారంటే.ఈజీగా మనీ సంపాదించాలని ఎన్నో దారుణమైన కంత్రీ ప్లాన్స్ వేస్తున్నారు. అంతేకాదు భార్య భర్తలు కూడా అన్న చెల్లెలుగా నటిస్తూ డబ్బులు కొట్టేస్తున్నారు. ఇక్కడ ఇలాంటి మోసం చేశారు.
కట్టుకున్న భార్యనే చెల్లిగా పరిచయం చేస్తూ వేరే వ్యక్తికి ఇచ్చిపెళ్లి చేశాడు భర్త. పెళ్లైన మూడో రోజే ఆ ఇంట్లో ఉన్ననగదు,బంగారంతో భార్య పారిపోయింది.ఈ దారుణమైన ఘటన రాజస్ధాన్లో జరిగింది.

కోట జిల్లా కునాడి పోలీసు స్టేషన్ పరిధిలో రవి అనే యువకుడు పెళ్లి చేసుకోటానికి దేవరాజ్ సుమన్ అనే మ్యారేజి బ్రోకర్ను సంప్రదించాడు. ఫోటోలు చూపిస్తే కోమల్ అనే యువతి నచ్చింది. ఇక ఆమె కి పేరెంట్స్ లేరు అన్నయ్య ఉన్నాడు అని బ్రోకర్ చెప్పాడు. వారంతా హోటల్లో కలిశారు. కోమల్ వాళ్ల అన్నయ్య సోనూ కార్పరే, సుమన్ కలిశారు, ఇక కట్నం ఇవ్వలేము అని చెప్పాడు.

కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఇద్దరి పెళ్లి ఒక గుళ్లో జరిపాడు సోనూకార్పరే. కోమల్ భర్తతో కాపురానికి వెళ్లింది. కోమల్ ఎక్కువ సేపు సోనూకార్పరేతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఇక అన్న కదా అని అందరూ అనుకున్నారు. ఇక మూడు రోజుల తర్వాత ఆమె నగదు, బంగారం తీసుకుని పారిపోయింది. చివరకు పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బ్రోకర్ ని భార్య భర్తలని ఇద్దరిని అరెస్ట్ చేశారు.