ఆధార్ తో పాన్ కార్డు అనుసంధానించాలని కేంద్రం ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది. ఇక ఇప్పటికే ఇచ్చిన పలు గడువు తేదీలను మరింత పొడిగిస్తూ వస్తోంది. ఈ కరోనా సమయంలో ఇప్పటికే గడువు పెంచింది. తాజాగా మరోసారి
దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో జూన్ 30 వరకు గడువు విధించగా, అది మరి కొన్నిరోజుల్లో ముగియనుంది.
తాజాగా పాన్ కార్డు-ఆధార్ లింక్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటన చేసింది. దీంతో ఇంకా ఎవరైనా లింక్ చేసుకోని వారు ఉంటే కచ్చితంగా లింక్ చేసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో ఆధార్- పాన్ కార్డు లింక్ ఎంతో కీలకం.
మరి ఈ ఆధార్ పాన్ లింక్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం.
https://www.incometax.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
మీకు అక్కడ హోమ్ పేజీలో Link Aadhaar ఆప్షన్ కనిపిస్తుంది.
అది క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Link Aadhaar పైన క్లిక్ చేస్తే పాన్, ఆధార్ నెంబర్లు లింక్ అవుతాయి.
ఇది చాలా సింపుల్ ప్రాసెస్
ఇదే వెబ్ సైట్ https://www.incometax.gov.in/