వ్యాపారి మంచి మనసు – ఆమె చదువు కోసం 12 మామిడి పండ్లను ఎంతకి కొన్నారంటే

How much did the business man buy 12 mangoes for her education

0
105

ఈ కరోనా చాలా మందిని కష్టాల్లో నెట్టింది. ముఖ్యంగా చాలా మంది పిల్లలు తల్లిదండ్రులని కూడా కోల్పోయారు. పేదరికంతో పోరాడుతూ ఎంతోమంది చిన్నారులు వారి చదువులకు దూరం అయ్యారు. ఓ బాలిక చదువుకోవాలి అని కోరికతో ఉంది . కానీ ఆమె ఆర్దిక పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉంది. జంషెడ్పూర్కు చెందిన తులసి కుమారి అనే పదకొండేళ్ల బాలిక ఆన్లైన్లో క్లాసులు వినేందుకు ఫోన్ లేక చదువుకి దూరంగా ఉంది.

రోడ్డుపై మామిడి పండ్లు అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈ సమయంలో ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యాపారి ఆమె అమ్ముతున్న ఒక్కో మామిడి పండు పదివేలకు తీసుకున్నాడు. ఇలా 12 పండ్లు 1.20 లక్షలకు తీసుకున్నాడు. ఆమెకి ఈ సాయం చేసిన వ్యాపారి ఎవరంటే? ముంబైకి చెందిన అమెయా హేతే అనే వ్యాపారవేత్త.

ఎడ్యుటైనర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అమేయా హేతే. ఆమెకి చదువుపై ఉన్న ఆసక్తి గమనించి ఈ సాయంచేశారు. ఆమె తండ్రి నరేంద్ర హేతే దగ్గర రూ.120రూపాయలు విలువ చేసే మామిడి పండ్లను.. లక్షా 20వేల రూపాయలు పెట్టి కొన్నాడు. ఆమెకి ఫోన్ మాత్రమే కాదు నెట్ కనెక్షన్ కూడా రెండు సంవత్సరాలు అందించాలి అని తెలిపాడు. ఆమె ఈ సాయం విని ఎంతో సంతోషించింది.