భర్త చనిపోయాడని రెండో పెళ్లి చేసుకుంది – కానీ నాలుగేళ్లకు తిరిగి వచ్చాడు

The second married when her husband died-But he returned four years later

0
111

మిచిగాన్ లో సెంట్రీజా అనే వ్యక్తి పెయింటర్ గా పనిచేసేవాడు. ఈ సమయంలో అతను అక్కడ జాస్మీ అనే యువతిని ప్రేమించాడు. ఆమె గొప్పింటి అమ్మాయి. ఇక ఇద్దరూ కలిసి తమ ప్రేమని పెద్దలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అయితే సెంట్రీజా, జాస్మీ ఇద్దరూ కలిసి వేరే ఇళ్లు తీసుకుని కాపురం పెట్టారు. అయితే మిచిగాన్ నుంచి అతను వేరే చోట కాంట్రాక్ట్ వర్క్ ఉంది అని అక్కడకు వెళ్లాడు.

ఇక జాస్మీ ఇక్కడే ఉండి చదువుకునేది. అయితే నెల నెలా డబ్బులు పంపేవాడు. కాని 2017 నుంచి డబ్బులు పంపలేదు, అతని నుంచి ఫోన్ లెటర్ ఏమీ రాలేదు. ఏమైందా అని జాస్మీ ఆలోచించింది. కాని అతని జాడ తెలియలేదు. అయితే అతను ఒ కేసులో ఇరుక్కుని సెంట్రిల్లాలో జైల్లో ఉన్నాడు. చివరకు నాలుగు సంవత్సరాలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చాడు.

కాని ఆమె అక్కడ లేదు. అప్పటికే తల్లిదండ్రులు ఇక అతను చనిపోయి ఉంటాడని, లేదా నిన్ను మోసం చేశాడు అని ఆమెని నమ్మించి వేరే పెళ్లి చేశారు. ఇక ఆ వ్యక్తి ఓ ఇంజనీర్. చివరకు అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. తన భార్య తనకి కావాలని కేసు పెట్టాడు. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి ఓ బాబు కూడా ఉన్నాడు.