తెలంగాణ వచ్చిన కొత్తలో రోజుకో దగ్గర సిఎం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు జరిగేవి. పాలాభిషేకాల వల్ల పసిబిడ్డలకు పాల కొరత ఏర్పడిందని విపక్ష నేతలు విమర్శలు చేసేవారు.. అంతగా పాలాభిషేకాలు జరిపిన నాయకులు, కార్యకర్తలు ఇటీవల పాలాభిషేకాల సంఖ్యను తగ్గించారు.
కానీ తాజాగా దళితులకు కేసిఆర్ వరాలు గుప్పించారు. ఆల్ పార్టీ మీటింగ్ లో పేద దళిత కుటుంబాలను గుర్తించి దళిత ఎంపవర్ మెంట్ కింద వారికి పదిలక్షల సాయం ప్రకటించారు. సబ్ ప్లాన్ నిధులకు ఇవి అదనం అని చెప్పారు. దీంతో మళ్లీ పాలాభిషేకాలు షురూ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి మండల కేంద్రంలో టిఆర్ఎస్ ఎస్సీ సెల్, దళిత సంఘాల ఆధ్వర్యంలో కేసిఆర్, స్థానిక హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసిఆర్ తీసుకున్న ఈ నిర్ణక్ష్ ద్వారా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని పార్టీ నేతలు అన్నారు. ఈ సందర్భంగా నాయకులు స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ ఎస్ ఎస్ మెంబర్ సాంబారి కొమురయ్య, న్యాయవాది బెజ్జంకి రాంబాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కుట్లచంద్రయ్య, టిఆర్ఎస్ వి మండల ఇంచార్జి బోయిని మనోజ్, ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం ,సర్పంచులు సుద్దాల ప్రవీణ్ ,బోయిని శ్రీనివాస్, గ్రామ రైతు కోఆర్డినేటర్ సిద్దంకి రాజమల్లు, మామిడి అంజయ్య, బేజ్జంకి అంజయ్య, ధర్మేందర్, బోయిని సతీష్, శ్రీనివాస్,ఎడల్లి వన్ సంపత్ ,అజయ్, ధర్మేందర్, మహంకాళి కొమురయ్య, కోడ ముంజ శ్రీనివాస్, నాంపల్లి, అశోక్, పైస చంద్రయ్య, కొమురవ్వ పాల్గొన్నారు.