తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు : బులిటెన్ రిలీజ్, జిల్లాల లిస్ట్ ఇదే

Today Telangana Corona Cases Bulletin Released

0
109

తెలంగాణలో సోమవారం కేసులు గణనీయంగా పెరిగాయి. సోమవారం నాటి బులిటెన్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. ఇవాళ కోవిడ్ పాజిటీవ్ కేసులు 993 నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. ఆదివారం కేసుల సంఖ్యతో సుమారు 250 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఇవాళ కేసుల్లో త్రిబుల్ డిజిట్ కేసులు జిహెచ్ఎంసి పరిధిలో నమోదు కాగా ఏడు జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు నమోదైన మరణాల సంఖ్య 9 గా ఉంది. ఇవాళ చేసిన పరీక్షల సంఖ్య 112982. నేడు రికవరీ అయిన వారి సంఖ్య 1417. పెండింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 983.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య శనివారం 1028 తో పోలిస్తే ఆదివారం 748 కేసులు నమోదు అయ్యాయి. కానీ ఇవాళ మళ్లీ 993కు చేరుకున్నాయి. ఇక శుక్రవారం నమోదైన కేసులు 1061 కాగా, గురువారం నమోదైన 1088 కేసులు, బుధవారం నమోదైన 1114 కేసులు, మంగళవారం కేసులు 1175 నమోదయ్యాయి.

ఇవాళ మరణాల సంఖ్య 9 గా నమోదైంది. ఆదివారం 8 మంది, శనివారం 9 మరణాలు, శుక్రవారం 11 మరణాలు చోటు చేసుకోగా, గురువారం మరణాల సంఖ్య 9 కాగా, బుధవారం 12 మంది మరణించారు. మంగళవారం మరణాల సంఖ్య 10 ఉంది. మరణాల సంఖ్య గడిచిన వారం రోజులుగా పదికి అటూ ఇటుగా నమోదవుతున్నది. మొన్న,నిన్న, ఇవాళ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది.

జిల్లాల వారీగా చూస్తే జిహెచ్ఎంసిలో మాత్రమే 124 కేసులతో త్రిబుల్ డిజిట్ నమోదైంది. సింగిల్ డిజిట్ కేసులు నమోదైన జిల్లాలు మొత్తం 7. అందులో ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్ ఉన్నాయి.

నేడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 2
కొత్తగూడెం 58
జిహెచ్ఎంసి 124
జగిత్యాల 24
జనగామ 10
జయశంకర్ భూపాలపల్లి 19
జోగులాంబ గద్వాల 4
కామారెడ్డి 5
కరీంనగర్ 49
ఖమ్మం 50
కొమరం భీం ఆసిఫాబాద్ 5
మహబూబ్ నగర్ 15
మహబూబాబాద్ 51
మంచిర్యాల 59
మెదక్ 10
మేడ్చల్ మల్కాజ్ గిరి 45
ములుగు 32
నాగర్ కర్నూల్ 11
నల్లగొండ 78
నారాయణపేట 5
నిర్మల్ 4
నిజామాబాద్ 6
పెద్లపల్లి 48
రాజన్న సిరిసిల్ల 24
రంగారెడ్డి 39
సంగారెడ్డి 10
సిద్దిపేట 33
సూర్యాపేట 72
వికారాబాద్ 10
వనపర్తి 11
వరంగల్ రూరల్ 18
వరంగల్ అర్బన్ 37
యాదాద్రి భువనగిరి 25

 ఈ వార్త కూడా చదవండి…..

రేవంత్ రెడ్డి టీమ్ లో బిగ్ మైనస్ ఇదే : ఆ వర్గం నేతల్లో ఆవేదన