హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మితో రేవంత్ రెడ్డి భేటీ

0
88

నూనతనంగా నియమితులైన టిపిసిసి ప్రసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలిశారు.

జిహెచ్ఎంసి కార్యాలయంలో ఇవాళ ఉదయం 10 గంటలకు.. లింగోజిగూడ డివిజన్ కు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అక్కడ నుంచి జూబ్లీహిల్స్ లోని మల్కాజిగిరి పార్లమెంట్ ఆఫీస్ కు వెళ్ళారు.

ఈ సందర్భంగా నూతనంగా పిసిసి చీఫ్ అయినందుకు విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖరరెడ్డితోపాటు మేయర్ తో కొద్దిసేపు కూర్చుని మాట్లాడారు. కింద ఫొటోలు చూడొచ్చు.