స్పీడు పెంచిన బాలయ్య – ఆ ముగ్గురు దర్శకులకి బాలయ్య ఒకే చెప్పారా ?

Balakrishna greem signal to three directors For New Movies

0
104

బాలకృష్ణ వరుస పెట్టి సినిమాలు చేస్తారు. అస్సలు ఆయన సినిమాలకు గ్యాప్ ఉండదు. హిట్ ,ఫ్లాఫ్ అనేది కూడా ఆయన అస్సలు పట్టించుకోరు. తన అభిమానులని సినిమాలతో అలరిస్తూనే ఉంటారు. ఇక బాలయ్యతో సినిమా చేయాలని నేటి యంగ్ డైరెక్టర్లు కూడా ఆశలతో ఉన్నారు. వారు చెప్పే కధలు కూడా వింటున్నారు బాలయ్య. ఆయన తాజాగా అఖండ చిత్రం చేస్తున్నారు. ఈ దసరాకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా అనౌన్స్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్నారు. ఇక ఈ సినిమాపై కూడా ఎన్నో ఆశలు ఉన్నాయి అభిమానులకి. అయితే మరో ఇద్దరు దర్శకులు కూడా బాలయ్యకు స్టోరీ చెబుతున్నారనే వార్తలు టాలీవు్డ్ లో వినిపిస్తున్నాయి.

శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. లక్ష్యం- లౌక్యం ఇలాంటి సూపర్ హిట్లు ఇచ్చిన శ్రీవాస్ బాలయ్యతో డిక్టేటర్ చేశారు. ఇక ఆయన దారిలోనే అనిల్ రావిపూడి వినాయక్ కూడా సినిమాలు చేయనున్నారట. మొత్తానికి బాలయ్య మరో మూడు ప్రాజెక్టులు ఒకే చేయనున్నారు అనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది.