దేశంలో సెకండ్ వేవ్ ఎంత దారుణంగా విజృంభించిందో చూశాం, ఇక థర్డ్ వేవ్ భయాలు అలాగే ఉన్నాయి. ఈ సమయంలో
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకూ ఎంత వరకూ వ్యాక్సినేషన్ పక్రియ అయింది అనేది ఓసారి చూద్దాం.
దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 32 కోట్ల 82 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది
27 కోట్ల 7 లక్షల మందికి మొదటి డోస్ ఇచ్చారు
5 కోట్ల 74 లక్షల మందికి రెండో డోస్ కూడా ఇచ్చారు
ఏపీలో ఇప్పటి వరకు కోటి 54 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తైంది.
కోటి 23 లక్షల మందికి మొదటి డోస్ వేశారు
30 లక్షల 62 వేల మందికి రెండో డోస్ వేశారు
తెలంగాణ స్టేట్ లో చూస్తే కోటి 9 లక్షల 15 వేల మందికి వ్యాక్సినేషన్ అందింది
మొదటి డోస్ పూర్తైన వారు 93 లక్షలు
రెండో డోస్ పూర్తైన వారు 15 లక్షల 54 వేల మంది
దేశంలో మొత్తం 28 కోట్ల 83లక్షల మందికి covisheild అందితే
3 కోట్ల 97 లక్షల మందికి covaxine అందింది
ఇప్పటి వరకూ దేశంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి సంఖ్య 34 కోట్లు దాటింది. ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోండి.