తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, రాత్రి 7.00 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
జూలై 9న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం జరుగనుంది.
జూలై 10న పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.
జూలై 16న సాయంత్రం 4 గంటలకు ఆణివార ఆస్థానం జరుగనుంది.
– జూలై 24న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు వెల్లడించారు.