సజ్జలు, గోధుమలతో తయారు అయ్యే ఓ లిక్కర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చాలా ఖరీదైన లిక్కర్. బైజు కంపెనీ నుంచి వచ్చే ఈ క్వీచో మోటె కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఆల్కాహాల్ శాతం 35 నుంచి 53 వరకు ఉంటుంది. మనం ఈ లిక్కర్ విషయంలో ప్రీమియమ్ మద్యం ధరలను చూస్తే 10 వేల వరకు ఉంటాయి. కానీ చైనాకు చెందిన మద్యం బాటిల్ ధర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. ఇవి రెండు కేసులు ఏకంగా 10 కోట్ల ధర కి అమ్ముతారు. అంటే ఒక్క బాటిల్ 43 లక్షలకు అమ్ముతారు.
Kweichow Moutai baijiu అనే కంపెనీకి చెందిన ఈ మద్యం బాటిళ్లను ఇటీవల అమెరికాలో వేలం వేయగా ఆసియాకు చెందిన ఓ వ్యక్తి 24 బాటిళ్లను 1.4 మిలియన్ డాలర్లు వెచ్చించి సొంతం చేసుకున్నాడు. ఇంత ఖరీదైన మద్యం ఇప్పటి వరకూ ఇదే. క్వీచో మోటె బైజు చైనాకు చెందిన కంపెనీ. ఎన్నో రోజుల నుంచి ఈ బ్రాండ్ చాలా ఫేమస్. ఈ మద్యం కేవలం బాగా డబ్బు ఉన్నవారు మాత్రమే తాగుతారు.
దీనికి చాలా చరిత్ర ఉంది. దీనిని 1972లో చైనా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడికి దీని రుచి చూపించారు. ఇక మళ్లీ 2013లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా అమెరికా అధ్యక్షుడు ఒబామాకు ఈ బ్రాండ్ ను కానుకగా అందించారు.దీని తయారీ కూడా ఒక్కో బాటిల్ కి మూడు నెలల సమయం తీసుకుంటారు.