ఆంధ్రప్రదేశ్ కోవిడ్ కేసుల బులిటెన్ రిలీజ్ -జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇవే

Andhrapadesh Covid cases bulletin released

0
90

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కేసులకు సంబంధించి శనివారం నాటి బులిటెన్ రిలీజ్ అయింది. ఇవాళ ఆంధ్రాలో నమోదైన కేసుల సంఖ్య 2930.  ఇవాళ 36 మంది మరణించారు.

ఇవాళ మొత్తం 90532 నమూనాలు పరీక్షించారు. చిత్తూరు జిల్లాలో ఇవాళ అత్యధిక మరణాలు చోటు చేసుకోగా కేసుల సంఖ్య మాత్రం తూర్పుగోదావరిలో అధికంగా నమోదయ్యాయి.
మరణాల జాబితా చిత్తూరులో 6 మంది, తూర్పు గోదావరిలో 5, గుంటూరు 4,కర్నూలు 4, కడప 3, ప్రకాశం లో 3, శ్రీకాకుళంలో 3, అనంతపురం 2 , కృష్ణా లో 2,విశాఖపట్నంలో 2, నెల్లూరులో 1 మరియు విజయనగరంలో 1 చొప్పున మరణించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 35871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 4346 మంది ఉన్నారు. కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 12815 గా నమోదైంది. మొత్తం 18.99 లక్షల్లో 18.51 లక్షల మంది (97శాతం) మంది రికవరీ అయ్యారు.
జిల్లాల వారీగా కేసుల సంఖ్యకు సంబంధించిన చాట్ కింద ఉంది చూడొచ్చు…
అనంతపూర్ 100
చిత్తూరు 443
తూర్పుగోదావరి 591
గుంటూరు 236
వైఎస్సార్ కడప 117
కృష్ణా 204
కర్నూలు 119
నెల్లూరు 185
ప్రకాశం 363
శ్రీకాకుళం 105
విశాఖపట్నం 70
విజయనగరం 59
పశ్చిమ గోదావరి 338
అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దు అని డాక్టర్లు చెబుతున్నారు. వెళ్లిన సందర్భంలో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.