ఈతరం సినిమా తారలు, సెలబ్రిటీలు సినిమాలు చేస్తూనే చాలా వరకూ కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ హీరోల నుంచి ఇప్పటి యాంకర్ల వరకూ అందరూ ఇదే విధానం ఫాలో అవుతున్నారు. ఇలా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని వ్యాపారాలు చేస్తుండటం మనం చూస్తున్నాం. నాగార్జున, మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ ఇలాంటి స్టార్స్ వ్యాపారాల్లో రాణిస్తున్నారు. ఇక తాజాగా యాంకర్ అరియానా కూడా కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది అరియానా. ఇక ఆమె అభిమానులు నెటిజన్లు ఆమెకి కంగ్రాట్స్ చెబుతున్నారు. అరియానా ఇంటర్వ్యూల ద్వారా బాగా ఫేమస్ అయింది.
ఇక ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా అరియానా పేరు మార్మోగిపోయింది. యాంకర్ గా ఆమెకి ఎన్నో అవకాశాలు వచ్చాయి. తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. ఇక హౌస్ లో ఆమె ఆట తీరుతో లక్షలాది మంది అభిమానులని సంపాదించుకుంది. ప్రస్తుతం పలు షోలతో, సినిమాలతో బిజీగా ఉంది అరియానా.