కేసిఆర్, కేటిఆర్ అమరులైనా సరే : రేవంత్ రెడ్డి ఘాటైన కామెంట్స్

0
90

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు రేవంత్ రెడ్డి సిఎం కేసిఆర్, ఆయన తనయుడు మంత్రి కేటిఆర్ మీద తీవ్రమైన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఆదివారం తన ఎంపీ ఆఫీసులో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.

ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదాస్పదంగా మారిన కృష్ణా జలాల అంశంపై కేసిఆర్, జగన్ నాటకాలాడుతున్నారని విమర్శించారు.  నిజంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం జరిగితే కేసిఆర్, కేటిఆర్ వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. కేసిఆర్, కేటిఆర్ ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరహార దీక్షకు దిగాలని సూచించారు. వారి దీక్షను పోలీసులు కానీ, డాక్టర్లు కానీ వచ్చి భగ్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డగోడగా నిలబడతాయన్నారు అవసరమైతే వారిద్దరూ అమరులైనా సరే పోరాటం ఆగదన్నారు.

నిజంగా కేసిఆర్ కు చిత్తశుద్ధి ఉంటే రోడ్ల మీద మాట్లాడడం కాదన్నారు. కేంద్రంతో పోరాడాలని సూచించారు. 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో నిలదీయాలన్నారు. బిజెపి, టిఆఎస్ దొందు దొందే అన్నారు. ఇంకా ఏమేం మాట్లాడారో… ఆయన మాటల్లోనే చదవండి.

నీటి విషయంలో కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నారు.

రాజకీయ, ఆర్థిక లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్ ఓ మహా జాదుగాడు, నీళ్ల నుంచి ఓట్లు రాబట్టగలరు. నీళ్లలో నిప్పులు సృష్టించగలడు.

ఏపీ, తెలంగాణ ప్రజలు ఒకరి కుత్తుకలు ఒకరు తెంచుకునేలా విద్వేషాలు రెచ్చగొట్టగలరు.

ఏపీ తెచ్చిన జీవో పై మేము ఫిర్యాదు చేసినప్పుడు కేసీఆర్ స్పందించలేదు.

కేసీఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే రాయలసీమ ప్రాజెక్టును జగన్ ప్రారంభించారు.

కేసీఆర్ నగరి ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి బేసిన్ లు లేవు, భేషజాలు లేవని ప్రకటించారు.

కృష్ణా జలాలను వివాదాలు లేకుండా వినియోగించుకుం టామని కేంద్రం ముందు ఒప్పందం చేసుకున్నారు.

కృష్ణా జలాల్లో ఏపీ 66శాతం, 34 శాతం తెలంగాణ వాడుకుంటమని సంతకాలు చేశారు.

ఈ రోజు మళ్లీ కొత్తగా 50 శాతం వాడుకుంటామని కేసీఆర్ మాట్లాడుతున్నా రు..

జగన్ జీవో తెచ్చినప్పుడు, పనులు మొదలుపెట్టినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు.

కానీ మేము ఒత్తిడి పెంచడం తో ఓ ప్రైవేట్ వ్యక్తి వేసిన పిటిషన్ లో ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది.

ఈ నెల 9 వ తేదీ జరగనున్న కేఆర్ఎంబి మీటింగ్ ను వాయిదా వేయాలని కేసీఆర్ ఎందుకు కోరుతున్నారు.

మీటింగ్ కు వెళ్లకుండా ఎందుకు రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు వైషమ్యా లు పెంచుతున్నా రు.

మీరు బిజీగా ఉంటే కడియం శ్రీహరినో తుమ్మల నాగేశ్వరరావునో పంపించండి.

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సామర్ధ్యాన్ని రెండు టీఎంసీల నుంచి 1టిఐఎంసి ని ఎందుకు తగ్గించారు.అంచనా వ్యయాన్ని 30వేల కోట్ల నుంచి 60వేల కోట్లకు పెంచారు..

సీఎం కేసీఆర్ పాత ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈ రోజు జగన్ కేంద్రానికి లేఖలు రాసే అవకాశం ఉండేది కాదు..

వివాదం చేసి సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందడానికే ఆ ప్రాజెక్టుల పెండింగ్ లో ఉంచారు.

కేసీఆర్ ను జగన్ కుటుంబ పెద్దగానే చూడాలి

నా మీద కోపంతో కొడంగల్ నారాయణ పేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును విస్మరించారు..

జూలై 9న కేసీఆర్ కెఆర్ఎంబి సమావేశానికి హాజరై వాదనలు వినిపించక పోతే జగన్ కు లొంగిపోయినట్లే.

కృష్ణా లో తెలంగాణ వాటా కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి..ఆ దీక్ష కు మేము మా పార్టీ తరపున మద్దతు తెలుపుతాం.