కోడలిని పెళ్లి చేసుకున్న మామ – కొడుక్కి సవతి తల్లిగా ఇంట్లోకి ఎంట్రీ – ఏమిటో ఈ కాలం

0
97

కొన్ని కొన్ని ఘటనలు వింటూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఒకింత షాక్ అవుతున్నారు జనం. చాలా చోట్ల తండ్రీకొడుకుల మధ్య విబేధాలు ఉండటం మనం చూస్తు ఉంటాం. చదువు, ఉద్యోగం, ప్రేమ విషయంలో తండ్రీకొడుకుల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఘటన గురించి వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే.

ఉత్తరప్రదేశ్ బదాయూ జిల్లాలో ఓ ఘటన జరిగింది. ఇక్కడ తండ్రీకొడుకులు గొడవపడింది ఓ మహిళ కోసం. ఇదేమిటి అని ఆశ్చర్యపోతున్నారా. ఎందుకంటే కొడుకు నుంచి విడాకులు తీసుకున్న భార్య, ఇప్పుడు తండ్రిని పెళ్లి చేసుకుంది. ఇదేమి విడ్డూరం వింత అని చూసిన ప్రతీ ఒక్కరు అనుకుంటున్నారు. అంటే కోడలిని భార్యగా తెచ్చుకున్నాడు ఈ మామ.

ఆ కొడుకుకు ఇప్పుడు ఆమె సవతి తల్లి అయ్యింది. 2016లో ఆ వ్యక్తికి ఓ అమ్మాయితో వివాహమైంది. అప్పటికి వారిద్దరూ మైనర్లే. ఆరు నెలల తర్వాత గొడవలతో విడిపోయారు.ఆమె విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి అతని తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. చివరకు జరిగింది ఏమిటి అంటే ఆ 48 ఏళ్ల తండ్రి కొడుకు పెళ్లిచేసుకున్న అమ్మాయిని తిరిగి వివాహం చేసుకుని, సంభాల్ లో కాపురం పెట్టాడు. ఇది విని ఆ కొడుకు షాక్ అయ్యాడు. దీనిపై ఆ కొడుకు కేసు పెట్టాడు.