అమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకుల ప్రకటన – ఆ హీరోయిన్ పై వైరల్ గా మారిన హ్యాష్ ట్యాగ్

-

బాలీవుడ్ లో హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు. పాన్ ఇండియా సినిమాలతో వందల కోట్ల సినిమా మార్కెట్ ని ఏర్పరచుకున్నారు. అయితే బాలీవుడ్ లో వార్తలు, గాసిప్స్ కూడా అలాగే వినిపిస్తాయి. ముఖ్యంగా రిలేషన్స్ , ప్రేమ ఇలాంటి వార్తలు బీ టౌన్ లో రోజూ వినిపిస్తాయి. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్లు తమ దాంపత్య జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

ఈ ప్రకటన చేయడంతో ఇటు ఇద్దరి గురించి నిన్నటి నుంచి చర్చ నడుస్తోంది. ఎంతో చూడచక్కని జంట ఇలా సడెన్ గా నిర్ణయం తీసుకోవడం పై అందరూ ఆశ్చర్యపోయారు.ఈ జంట విడిపోవడానికి దంగల్ ఫేమ్ ఫాతిమా సనా షేక్ కారణమనే ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

అమీర్ఖాన్ జీవితంలోకి సనా షేక్ రావడం వల్లే ఈ జంట విడిపోయిందని నెటిజన్లు పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఈ విషయంలో ఫాతిమా సనా షేక్ హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు.గతంలో అమీర్ఖాన్ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చేసిన వ్యాఖ్యలను కూడా కొందరు నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతోన్న ఈ ట్రోలింగ్పై అమీర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక 2016లో వచ్చిన దంగల్ చిత్రంలో ఫాతిమా అమీర్ఖాన్కు కూతురిగా కనిపించింది. తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్థాన్లో అమీర్ సరసన హీరోయిన్గా ఆమె నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Yoga Benefits | బద్దకాన్ని బద్దలు చేసే యోగాసానాలు

Yoga Benefits | చాలా మందికి నిద్ర లేవగానే మత్తుగా, బద్దకంగా...

Mohan Babu | మోహన్ బాబుకు హైకోర్టు ఝలక్.. అరెస్ట్ తప్పదా..

నటుడు మోహన్ బాబు(Mohan Babu)కు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. జర్నలిస్ట్‌పై...