20 నిమిషాల్లో పెళ్లి – ఆమె ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేసిన పెళ్లికొడుకు

నువ్వు గొప్పడివి బాస్ అంటున్నారు అందరూ.

0
107

ఈ మధ్య వివాహాలు జరుగుతున్న సమయంలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి. తాళికట్టే వరకూ ఈ వివాహం జరుగుతుందా లేదా అనే టెన్షన్ చాలా మందికి ఉంటోంది. తాజాగా యూపీలో ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. యశ్వంత్ అనే వ్యక్తి తన మరదల్ని ప్రేమించాడు. అయితే మరదలు జాస్మిన్ కూడా అతనిని ఇష్టపడింది. ఇద్దరూ మూడు సంవత్సరాలు లవ్ చేసుకున్నారు.

కాని అతనికి డబ్బు లేదు అని మామయ్య బయట సంబంధం చూశాడు. ఇక ఒకే ఊరు కావడంతో పెళ్లి పనులు అన్నీ అతనే దగ్గర ఉండి చూసుకున్నాడు. ఇక బావపై ప్రేమని ఆమె చంపుకుంది. వేరే పెళ్ళికి తల్లిదండ్రుల కోసం సిద్దమైంది. అయితే పెళ్లి సమయంలో ఆ పెళ్లికొడుక్కి వీరిద్దరిపై అనుమానం వచ్చింది.

అందరి ముందు నిలదీశాడు. యశ్వంత్ మా మధ్య ప్రేమ లేదు అని చెప్పాడు. కాని అతని ముఖం చూసి ఆమె ఏడుపు చూసి సీన్ అర్దం అయింది పెళ్లికొడుక్కి. చివరకు వివాహం క్యాన్సిల్ చేసుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఇక ఎవరైతే ఈ పెళ్లి వద్దు అన్నాడో ఆ పెళ్లికూతురు తండ్రి చివరకు తన అక్క కొడుకు యశ్వంత్ కి ఇచ్చి వివాహం చేశాడు. ఈ జంట ఆ పెళ్లికొడుకు దగ్గర ముందు ఆశీర్వాదం తీసుకున్నారు.

నువ్వు గొప్పడివి బాస్ అంటున్నారు అందరూ.