మన దేశంలో ఆచార్య చాణక్య గురించి తెలియని వారు ఉండరు. ఆయన చెప్పిన సూత్రాలు ఇప్పటికీ పాటించే వారు ఎందరో ఉన్నారు. ఆచార్య చాణక్య అపర మేధావిగా, వ్యూహకర్తగా, ఆర్థిక వేత్తగా గుర్తింపు పొందారు. ఆయన రాసిన ఎన్నో గ్రంధాలు విషయాలు నేటికి యువత చదువుతారు పాటిస్తారు. కుటుంబం, ప్రేమ, వ్యాపారం ఇలా అనేక విషయాలపై ఆయన లోతైన రచనలు రాశారు గ్రంధాల్లో.
ఆచార్య చాణక్య రాసిన గ్రంథంలో ఒక వ్యక్తి ఉద్యోగం, వ్యాపారంలో విజయం సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అని చెబుతున్నారు. కచ్చితంగా ఉద్యోగంలో ఉంటే ఆ కంపెనీ కోసం నువ్వు కష్టపడాలి. నీ యజమాని శ్రేయస్సు కోరుకోవాలి. దాని నుంచి నీ గుర్తింపు ఎదుగుదల కచ్చితంగా ఉంటుంది.
పని పట్ల నిజాయితీ, క్రమశిక్షణ ఉండాలి.
రిస్క్ తీసుకునే ధైర్యం కచ్చితంగా ఉండాలి
మంచి ప్రవర్తన ఏ వ్యాపారం అయినా ఉద్యోగం అయినా ఉండాలి
టీమ్ వర్క్ కి సపోర్ట్ ఉండాలి. టీమ్ ని ముందుకు నడిపే సత్తా దైర్యం ఉండాలి.
నమ్మకం- నిజాయతీ- కష్టపడే తత్వం ఉండాలి.