కూర గుమ్మడికాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Do you know the health benefits of curry pumpkin?

0
174

సాంబారు, పులుసు వీటిని గుర్తు చేయగానే వెంటనే కూర గుమ్మడికాయ గుర్తు వస్తుంది. ఈ కూర గుమ్మడికాయ పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వీటిని తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు అనేది తెలుసుకుందాం. జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి ఈ సమస్యలను తగ్గించడంలో గుమ్మడికాయ ఔషదంగా పనిచేస్తుంది.

కూర గుమ్మడికాయలో విటమిన్ సి, ఇ, ఎ.. ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.
వర్షాకాలంలో మొటిమలు, చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. శరీరంలో ఎవరికి అయినా ఐరన్ లోపం ఉంటే గుమ్మడికాయ 15 రోజులకి ఓసారి అయినా ఆహారంలో తీసుకోండి. గుమ్మడి కాయ విత్తనాలలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇక ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అలాగే కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఊబకాయ సమస్యలు తగ్గుతాయి, బరువు తగ్గాలి అనుకునే వారు తినవచ్చు. గుమ్మడి కాయ గుజ్జుతో మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఇక కొందరు ఈ గుమ్మడికాయ తింటే అజీర్తి అనుకుంటారు. నిత్యం తింటే సమస్య కాని మితంగా 10 లేదా 15 రోజులకి తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.