నేడే వైఎస్ షర్మిల కొత్త పార్టీ : షెడ్యూల్ ఇదే

0
112

రాజ‌న్న సంక్షేమ పాల‌నే ధ్యేయంగా దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల కొత్త పార్టీకి నేడు పురుడు పోస్తున్నారు. వైఎస్ఆర్ జ‌యంతి రోజైన గురువారం పార్టీ జెండాను విడుద‌ల చేసి.. ఎజెండాను ప్ర‌క‌టిస్తారు.

నేటి వైఎస్ ష‌ర్మిల షెడ్యూల్‌..

ఉద‌యం 7:30 గంట‌ల‌కు ఇడుపుల‌పాయ‌లోని మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఘాట్ వ‌ద్ద నివాళుల‌ర్పిస్తారు. పార్టీ జెండాను విడుద‌ల చేసి.. మ‌హానేత ఆశీస్సులు తీసుకుంటారు.

ఇడుపుల‌పాయ నుంచి 12 గంట‌ల‌కు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ వేదిక జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్‌కు బ‌య‌ల్దేరుతారు.

మార్గ మ‌ధ్య‌లో పంజగుట్ట సెంట‌ర్‌లో గ‌ల మ‌హానేత వైఎస్ఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పిస్తారు.

అక్క‌డి నుంచి నేరుగా మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జేఆర్‌సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌కు చేరుకుంటారు.

4 గంట‌ల‌కు పార్టీ జెండాను, అజెండాను ప్ర‌క‌టించి.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వైఎస్ ష‌ర్మిల  ప్ర‌సంగిస్తారు.

తిరిగి 6:30 గంట‌ల‌కు లోట‌స్‌పాండ్‌లోని త‌న నివాసానికి చేరుకుంటారు.