హీరోగా నితిన్ – హీరోయిన్ గా పూజ హెగ్డే – టాలీవుడ్ టాక్

Nitin- Pooja Hegde Combination Movie

0
96

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇక కరోనా కారణంగా చాలా సినిమాలు రిలీజ్ అవ్వ‌కుండా ఆగిపోయాయి. అయితే రిలీజ్ కు వచ్చే సినిమాల్లో పూజ నటించిన సినిమాలు ఉన్నాయి, వీటి కోసం ఆమె కూడా వెయిట్ చేస్తోంది. తాజాగా ఆమె మరో సినిమాని ఒకే చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో నితిన్ దర్శకుడు వక్కంతం వంశీ తో సినిమా చేయనున్నారనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.ప్రస్తుతం మాస్ట్రో సినిమా చేస్తున్నారు నితిన్ . ఆ తర్వాత నితిన్ వక్కంతం వంశీతో సినిమా చేయడానికి చూస్తున్నారట. ఇక ఈ సినిమాలో పూజ హేగ్డేని హీరోయిన్ గా తీసుకోవడానికి చూస్తున్నారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.

పూజ తాజాగా అఖిల్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ప్రేక్ష‌కుల‌ ముందుకు రానుంది. ఇక తర్వాత ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ రానుంది. ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమా రానుంది అందులో నటించారు పూజ‌. ఇక త్రివిక్రమ్ – మహేశ్ బాబు సినిమాలో కథానాయికగా కూడా పూజ పేరు వినిపిస్తోంది.