Breaking New : తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు , ఆన్‌లైన్ సేవలు బంద్ : కారణం ఇదే

Telangana government websites closed

0
103

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు 48 గంటల పాటు నిలిచిపోనున్నాయి.9వ (శుక్రవారం) తేదీ రాత్రి 9 గంటల నుంచి 11వ తేదీ (ఆదివారం) వరకు సర్కారు వెబ్‌సైట్లు, ఆన్‌లైన్ సేవలు బంద్ కానున్నాయి.

స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ)లో సర్వర్లు పాతవి కావడం, పవర్ బ్యాకప్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ఆన్‌లైన్ సేవల్లో అంతరాయం కలుగుతోంది.దీంతో వీటిని ఆధునీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఐటీ విడుదల చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్ ప్రకారం.. మరమ్మతుల కారణంగా డేటా సెంటర్‌కు అనుబంధంగా ఉన్న ఇతర ఆన్‌లైన్ సేవలు నిలిచిపోతాయి.ఈ సేవలు తిరిగి 11వ తేదీ రాత్రి 9 గంటలకు పునరుద్ధరించడబతాయి.