కొన్ని దేశాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరికొన్ని చోట్ల దారుణంగా కేసులు పెరుగుతున్నాయి .డెల్టా వేరియంట్ విజృంభిస్తోన్న వేళ జపాన్లో మళ్లీ ఎమర్జెన్సీని విధించారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు ఆ దేశంలో ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే.
మూడో ఎమర్జెన్సీ జులై 12 నుంచి 22 వరకు ఎమర్జెన్సీ అమలులో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. టోక్యోతో సహా ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ లు అన్నింటిలో డెల్లా వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు జపాన్ ప్రధాని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో రోడ్లపైకి ప్రజలు గుంపులుగా వచ్చేందుకు అవకాశం ఉండదు.
ఇక దేశంలో పార్టీలు ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదు. ఏ పనీ లేకుండా రోడ్ల మీదకు వస్తే కేసులు పెడతారు. మరో నాలుగు రోజుల్లో టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ కరోనా పరిస్దితుల వల్ల ప్రేక్షకులు లేకుండానే విశ్వక్రీడలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తానికి ఒలింపిక్స్ సమయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకుంటోంది దేశ ప్రభుత్వం.