బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ ఫ్లాట్ ని బ్యాచిలర్స్ కి అద్దెకి ఇచ్చాడు సత్యమంగళరావు. అయితే నలుగురు కుర్రాళ్లు అందులో ఉండేవారు. అందులో ఓ వ్యక్తి నవీన్ ఇంటి ఓనర్ సత్యమంగళరావు కుమార్తె సిందుపూజితతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరూ జాబ్స్ కోసం సెర్చ్ చేసేవారు. ఇలా ఇద్దరు కలిసి ప్రేమలో పడ్డారు. చివరకు ఆమెకి అమెరికా సంబంధం చేయాలి అని ఓ పక్క సంబంధాలు చూస్తుంటే వారిద్దరూ ప్రేమలో ఉన్నారు.
చివరకు కరోనా సమయంలో మిగిలిన ముగ్గురు రూమ్ నుంచి వెళ్లిపోయారు. దీంతో అతను ఒక్కడే ఉన్నాడు అని కూరలు వంట అన్నీ అతని రూమ్ కి తీసుకు వెళ్లేది పూజ. ఫ్రెండ్లీగా తీసుకువెళుతుంది అనుకున్నాడు తండ్రి. కాని ఈ సమయంలో ఇద్దరూ శారీరకంగా ఒకటి అయ్యారు. నాలుగు నెలలుగా వీరి బంధం మరింత బలపడింది. చివరకు ఆమె గర్భవతి అయింది. అయితే ఆ నవీన్ పై కేసు పెడదాం అనుకున్నాడు కాని.
అతను లేకపోతే నేను ఉండలేను అని బిందు అనడంతో, కరోనా జాగ్రత్తలు పాటించి చివరకు ఇద్దరికి పెళ్లి చేశారు. ఇలా బ్యాచిలర్ గా ఆ ఇంటిలోకి వచ్చి చివరకు అతని కూతురుతోనే కాపురం పెట్టాడు ఈ వ్యక్తి. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా వివాహం జరిపించారు.