పిసిసి చీఫ్ హోదాలో కేసిఆర్ కు రేవంత్ రెడ్డి తొలి లేఖ దీనిపైనే..

0
90

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత సిఎం కేసిఆర్ కు తొలి బహిరంగల లేఖ రాశారు. ఆ లేఖ కూడా నర్సులకు ఉద్యోగాలు తొలగించిన అంశానికి సంబంధించినది. లేఖలోని అంశాలు…

కరోనా సమయంలో స్టాఫ్ నర్సులను దేవుళ్లు అని మీరే పొగిడారు. ఆ దేవుళ్లు ఇప్పుడు ప్రగతి భవన్ ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1600 కుటుంబాలను రోడ్డున పడేశారు. ప్రగతి భవన్ కు వస్తే ఐదు నిముషాలు వాళ్ల గోడు వినే తీరిక మీకు లేదా? ప్రగతి భవన్ అనేది ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా? చెప్పండి.

2018 లో ఎంపికైన ఎఎన్ఎంలకు ఇప్పటికీ పోస్టింగులు ఎందుకు ఇవ్వడం లేదు? 50 వేల ఉద్యోగాల భర్తీ పై మీరు చేసిన ప్రకటన చీటింగ్ “వన్స్ మోర్” లాగా ఉంది. ప్రభుత్వంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని బిశ్వాల్ కమిటీ నివేదిక ఇస్తే మీరు 50 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏమిటి? ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లలో ఉద్యోగ ఖాళీల భర్తీ సంగతి ఏమిటో స్పష్టం చేయండి. స్టాఫ్ నర్సులను యథాతథంగా విధుల్లో కొనసాగించాలి. 2018 ఎఎన్ఎం అభ్యర్థులకు తక్షణం పోస్టింగులు ఇవ్వాలి. ప్రభుత్వంలోని 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలతో పాటు, కార్పొరేషన్ల లోని ఖాళీల భర్తీకి తక్షణం షెడ్యూల్ ప్రకటించాలి. లేని పక్షంలో అతి త్వరలో నిరుద్యోగ యువత తరఫున టీపీసీసీ కార్యచరణ ఉంటుంది.

staff nurses met revanth reddy

ప్ర‌భుత్వం తొల‌గించిన 1640 మంది స్టాప్ న‌ర్సుల‌ను తిరిగి డ్యూటీలోకి తీసుకునే విధంగా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుక‌రావాలంటూ టీపీసీసీ అధ్య‌క్షులు రేవంత్ రెడ్డికి శనివారం విన‌తి ప‌త్రం ఇచ్చారు కాంట్రాక్ట్‌,అవుట్ సోర్సింగ్‌ న‌ర్సులు. క‌రోనా విజృంభించిన వేళ ప్రాణాల‌ను సైతం ఫణంగా పెట్టి క‌రోనా రోగుల‌కు 24 గంట‌ల పాటు సేవ‌లు అందించిన కాంట్రాక్ట్‌, అవుట్ సోర్సింగ్ న‌ర్సుల‌ను  ఉద్యోగాల నుంచి తొల‌గించ‌డం హేయ‌మైన చ‌ర్య‌.  న్యాయం జ‌రిగే వ‌ర‌కు  కాంగ్రెస్ పార్టీ  వారికి అండ‌గా ఉంటుంద‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.