నటి అనుపమ పరమేశ్వరన్ కు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలిసిందే. ఆమె సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ , కోలీవుడ్ లో ఈ మలయాళ కుట్టికి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ తన ప్రేమ గురించి బయటపెట్టారు. గతంలో ఓ వ్యక్తిని గాఢంగా ప్రేమించానని తెలిపారు.కాకపోతే అది బ్రేకప్ అయిపోయిందని అన్నారు.
తెలుగులో అ ఆ తో నాగవల్లిగా మెప్పించి తెలుగువారికి చేరువైంది ఈ మలయాళీ కుట్టి. తాజాగా ఇన్స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. ఈ సమయంలో అనేక విషయాలు పంచుకుంది. ఇక తనకు హీరో రామ్ మంచి ఫ్రెండ్ అని చెప్పింది.ఇప్పుడు తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నాను. 18 పేజీలు, కార్తికేయ -2, రౌడీ బాయ్స్ ఇవి సెట్స్ పై ఉన్నాయి.
కోలీవుడ్లో ఆధ్వర్య ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న తల్లిపోగాదేలో నటిస్తున్నానని చెప్పింది అనుపమ. అమ్మ చేతి వంట అంటే నాకెంతో ఇష్టం. పాటలు పాడటం కూడా ఇష్టమే. ఇక ఈ మధ్య పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను అని తెలిపింది.