కత్తి మహేష్ రియల్ స్టోరీ

0
104

కత్తి మహేష్ తెలుగు సినిమా నటుడిగా, దర్శకుడిగా, సినీ విమర్శకుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. కత్తిమహేష్ చిత్తూరు జిల్లాలో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన తండ్రి వ్యవసాయశాఖలో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఇక మహేష్ కు ఓ అన్న ,చెల్లి ఉన్నారు.

ఆయన చిత్ర సీమలోకి రావాలి అని ఎప్పటి నుంచో కలలు కన్నారు. రాఘవేంద్రరావు ప్రొడక్షన్ హౌస్ లో రాఘవేంద్ర మహత్య్మం సీరియల్ కు పనిచేశారు. తర్వాత 2011లో దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన ఊరు చివర ఇల్లు కథను ఆధారంగా చేసుకొని ఒక షార్ట్ ఫిలింకి దర్శకత్వం వహించారు.మిణుగురులు అనే చిత్రానికి సహ-రచయితగా వ్యవహరించారు. పెసరట్టు సినిమాని తీశారు. హృదయ కాలేయం లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించారు.

ఓ ఛానల్ డిబేట్ లో రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆరు నెలలపాటు నగరం నుంచి నగర బహిష్కరణకు గురయ్యారు. కత్తి మహేష్ బెంగాలీ యువతి సోనాలిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు భోపాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఓ కుమారుడు ఉన్నారు.బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ మొదటి సీజన్లో కత్తి మహేశ్ పాల్గొన్నారు. ఇక నేనే రాజు నేను మంత్రి, కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, క్రాక్ సినిమాల్లో నటించారు కారు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కత్తి మహేష్ 10 రోజులుగా చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.