మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి, జీవితాంతం తోడుగా ఉంటాను అని పెళ్లి చేసుకున్న భర్త, ఎవరూ చేయని దారుణం చేశాడు. ఏకంగా అప్పు కోసం భార్యనే అమ్మేశాడు . ఈ ఘటన సంచలనం అయింది. మధ్యప్రదేశ్ గునలో ఈ అమానుష ఘటన జరిగింది. అసలు ఏమైందో చూద్దాం.
గున ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఈ సమయంలో ముగ్గురు దగ్గర 50 వేలు అప్పు తీసుకున్నాడు. ఇక ఆ అప్పు తీర్చే మార్గం అతనికి కనిపించలేదు.
దీంతో తన భార్య లాడో బాయ్ ను లక్ష రూపాయలకు అమ్మేశాడు. ఆమె పొలంలో పని చేసుకుంటే ఆ ముగ్గురిని పొలం దగ్గరకు తీసుకువెళ్లాడు. వారికి నిన్ను అమ్మేశాను ఇక నువ్వు వారితో వెళ్లిపొ అని చెప్పాడు.
దీంతో ఆమె షాక్ అయింది. నేను వెళ్లను అని చెప్పింది. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. అక్కడ నుంచి ఆమె ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి గోపాల్, అతడి తల్లి ఇంట్లో నిద్రపోతున్న లాడో బాయ్ ని తీసుకెళ్లి బావిలో పడేశారు. దీంతో పక్కవారు ఆ శబ్దానికి వచ్చి బావి నుంచి ఆమెని బయటకు తీశారు. స్దానికులు, పేరెంట్స్ సాయంతో పోలీస్ స్టేషన్ లో ఆమె అత్త, భర్తపై కంప్లైంట్ ఇచ్చింది. అత్తని అరెస్ట్ చేశారు పోలీసులు. భర్త పరారీలో ఉన్నాడు .ఆ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.