మామిడి పండ్లు అతిగా తింటున్నారా ఇది తెలుసుకోండి

Find out these if you are overeating mangoes

0
101

మామిడి పండ్లని ప్రతీ ఒక్కరు ఇష్టంగా తింటారు. ఇక సీజన్ అయిపోయింది. ఈ ఆగస్ట్ వరకూ మామిడి పండ్లు వస్తూనే ఉంటాయి. అయితే అతిగా మామిడి పండ్లు తిన్నా కొన్ని సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.మామిడి సీజన్లో వాటిని మగ్గపెట్టడానికి అనేక రకాల రసాయనాలను తరచుగా ఉపయోగిస్తారు. దీని వల్ల మన శరీరానికి హాని కలిగిస్తుంది.

ఈ రసాయనాలు మామిడి పళ్లను కడిగిన తర్వాత కూడా తొలగించలేము. అందుకే ఆ తొక్కతో అస్సలు మామిడి పండ్లు తీసుకోవద్దు అంటారు నిపుణులు. అతిగా మామిడి తింటే బరువు పెరిగే సమస్య ఉంది.
మామిడి తింటే వేడిగా ఉంటుంది. అధికంగా తినడం వల్ల మన శరీరంలో మొటిమలు కూడా వేధిస్తాయి.

ఇక షుగర్ సమస్య ఉంటే మామిడి తీసుకోవద్దు. దీని వల్ల సమస్యలు ఉంటాయి. ఇక రాత్రి పూట అస్సలు మామిడి తీసుకోవద్దు. ఇక జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అల్పాహారం తర్వాత, మధ్యాహ్నం భోజనం తర్వాత మామిడి తీసుకోండి. రాత్రి 8 తర్వాత అస్సలు తీసుకోవద్దు.