మన దేశంలో కొబ్బరికాయను ప్రతీ పూజలో ప్రతీ ఆలయంలో భక్తులు దేవుడికి కొడతారు. నైవేథ్యం నుంచి అభిషేకాలు, హోమాలు ఇలా ఏం చేసినా అక్కడ కొబ్బరికాయ దేవుడికి సమర్పిస్తాం. కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్లిపోతే మహాపాపం, ఏదో జరగడానికి ఇది కీడు సంకేతం అని చాలా మంది భయపడుతూ ఉంటారు. కాని ఇది నమ్మవద్దు అంటున్నారు పండితులు. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఆ కొబ్బరికాయ నిల్వ ఉండటం వల్ల, తేమ ఎక్కువ ఉండటం, నీటిలో నానడం, ఇలా అనేక కారణాలతో లోపల కుళ్లిపోవచ్చు.
ఇలా కుళ్లిన కాయ వస్తే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు. ఇక అభిషేకం చేసే సమయంలో ఇలాంటి కాయ వస్తే వెంటనే ఆ విగ్రహం శుభ్రం చేసి మరో కొబ్బరికాయని స్వామికి అభిషేకంగా సమర్పిస్తారు. దేవాలయంలో ఇలా జరిగితే మీరు వెంటనే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకుని. మరో కొబ్బరికాయని స్వామికి కొట్టండి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఇంటిలో కూడా పూజలు జరిగే సమయంలో ఇలా కొబ్బరికాయ కుళ్లితే, దానిని తీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ శుభ్రం చేసుకుని కొబ్బరికాయ కొట్టండి. కొత్త ఇళ్లులు గృహప్రవేశాలు, షాపు ఓపెన్ చేసిన సమయంలో ఇలాంటివి జరిగితే మనసులో బాధపడతారు. ఎలాంటి ఆందోళన వద్దు అంటున్నారు పండితులు.