స్టార్ హీరో వెంకటేష్ చేసిన రెండు చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఒకటి నారప్ప అయితే, మరొకటి దృశ్యం 2. తమిళ సినిమా అసురన్ కి రీమేక్ గా నారప్ప చిత్రం తెరకెక్కించారు. మంచి కథతో కూడుకున్న సినిమా ఇది.
తమిళ్ లో ధనుశ్ హీరోగా ఈ సినిమా చేశారు. కోలీవుడ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. తాజాగా తెలుగులో అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది.
ఇక వెంకటేష్ నటించిన మరో చిత్రం దృశ్యం 2. ఈ చిత్రం కూడా టాలీవుడ్ వార్తల ప్రకారం ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది అంటున్నారు. దీనిని కూడా ముందు అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
ఈ డీల్ ఒకే అయితే త్వరలో దీనికి సంబంధించి ప్రకటన రావచ్చు. ఇక మలయాళ దృశ్యం 2 కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలైంది. అక్కడ సూపర్ హిట్ అయింది. ఇక్కడ కూడా ఇదే ఫార్ములా ఉపయోగించవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు థియేటర్లో సినిమా విడుదల అయినా, పూర్తిగా జనం వచ్చి సినిమాలు చూస్తారు అనే ఆలోచనలో లేరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు.